Sri Naradapuranam-3    Chapters    Last Page

షట్‌ షష్ఠి తమో%ధ్యాయః = ఆరువది యారవ అధ్యాయము

హరిద్వార మాహాత్మ్యమ్‌

మోహిన్యువాచ : -

కురుక్షేత్రస్య మాహాత్మ్యం శ్రుతం పాపాసహం మహత్‌ | త్వత్తో ద్విజవర శ్రేష్ఠ సర్వసిద్ధి ప్రదం నృణామ్‌ 1
గంగాద్వారేతి యత్ఖ్యాతం తీర్థం పుణ్యావహం గురో | తత్సమాఖ్యాహి భద్రం తే శ్రోతుం వాంఛాస్తి మే హృది 2
మోహిని పలికెను : - బ్రాహ్మణోత్తమా! పాపహరమగు గొప్ప కురుక్షేత్ర మాహాత్మ్యమును వింటిని. ఇది సర్వసిద్ధి ప్రదమని నీ నుండి తెలిసితిని. గంగాద్వారమని ప్రసిద్ధి పొందిన పుణ్యావహతీర్థమాహాత్మ్యమును తెలుపుము. వినుటకు నాకు కోరిక యున్నది
వసురువాచ : -
శృణు భ##ద్రే ప్రవక్ష్యామి మాహాత్మ్యం పాపనాశనమ్‌ | గంగా ద్వారస్య తే పుణ్యం శృణ్వతాం పఠతాం శుభమ్‌ 3
యత్ర భూమిమనుప్రాప్తా భాగీరధ రధానుగా | శ్రీ గంగాలకనందాఖ్యా నగాన్భిత్వా సహస్రశః 4
యత్రాయజత యజ్ఞేశం పురా దక్షః ప్రజాపతిః | తత్‌క్షేత్రం పుణ్యదం నౄణాం సర్వపాతక నాశనమ్‌ 5
యస్మిన్యజ్ఞే సమాహూతా దేవా ఇన్ద్రపురోగమాః | సై#్వసై#్స్వర్గణౖ స్సమాయాతా యజ్ఞభాగజిఘృక్షయా 6
తత్ర దేవర్షయః ప్రాప్తా స్తధాబ్రహ్మర్షయో
% మలాః | శిష్య ప్రశిషై#్యస్సహితా స్తధా రాజర్షయ శ్శుభే 7
సర్వే నిమంత్రితా స్తేన బ్రహ్మపుత్రేణ ధీమతా | గంధర్వాస్సరసో యక్షా స్సిద్ధ విద్యాధరోరగాః 8
సంప్రాప్తా యజ్ఞసదన మృతే శర్వం పినాకినమ్‌ | తతస్తు గచ్ఛతాం తేషాం సప్రియాణాం విమానినామ్‌ 9
దక్షయజ్ఞోత్సవం ప్రీత్యాన్యోన్యం వర్ణయతాం సతీ | శ్రుత్వా సోత్కా మహాదేవం ప్రార్థయామాస భామినీ 10

తచ్ఛ్రుత్వా భగవానాహ న శ్రేయో గమనం తతః | అధ దేవమనాదృత్య భావినో
%ర్ధస్యగౌరవాత్‌ 11
జగామైకాకినీ భ##ద్రే ద్రష్టుం పితృమహోత్సమ్‌ | తతస్సా తత్ర సంప్రాప్తా న కేనాపి సభాజితా 12
ప్రాణాంస్తత్యాజ తన్వంగీ తజ్జాతం క్షేత్రముత్తమమ్‌ | తస్మింస్తీర్దేతు యేస్నాత్వా తర్పయన్తి సురాన్పితౄన్‌ 13

తే స్యుర్దేవ్యాః ప్రియతమా భోగమోక్షైక భాగినః | యే
%న్యే% పి తత్ర స్వాన్న్పాణాం స్త్యజన్త్యన శనాదిభిః 14
అధత న్నారదా చ్ఛ్రుత్వా భగవాన్నీలలోహితః 15
మరణం స్వప్రియాయాస్తు వీరభద్రం వినిర్మమే | ససర్వైః ప్రమదైర్యుక్తం స్తం యజ్ఞం సమనాశయత్‌ 16
పునర్విధేః ప్రార్ధనయా మిఢ్వాన్సద్యః ప్రసాదితః | సందధేచ పునర్యజ్ఞం వికృతం ప్రకృతి స్థితమ్‌ 17
తతస్తత్తీర్ధ మతులం సర్వపాతకనాశనమ్‌ | జాతం యత్రాప్లుతస్సామో ముక్తో యక్ష్మగ్రహాదభూత్‌ 18
తత్రయో విధివత్స్నాత్వా యం యం నామం విచింతయేత్‌ | తం తమాస్నోతి విధిజే నాత్ర కార్యా విచారణా 19
యత్ర యజ్ఞేశ్వరస్సాక్షా ద్భగవాన్నవిష్ణురవ్యయః | స్తుతో దక్షేణ దేవైశ్చ తత్తీర్థ హరిసంజ్ఞితమ్‌ 20
తత్ర యో విధివన్మర్త్య స్స్నాయాద్ధరిపదే సతి | సవిష్ణోర్వల్ల భో భూయా ద్భుక్తి ముక్త్యేక భాజనమ్‌ 21
అతః పూర్వదిశి క్షేత్రం త్రిగగం నామ విశ్రుతమ్‌ | యత్ర త్రిపధాగా సాక్షాత్‌ దృశ్యతే సకలైర్జనైః 22
తత్ర స్నాత్వాధ సన్తర్వ్య దేవర్షి పితృమానవాన్‌ | సమ్యక్చ్రద్దాయుతో మర్త్యో మోదతే దివి దేవవత్‌ 23

తత్ర యస్త్యజతి ప్రాణా న్ర్పవా
హే పతితస్సతి | స వ్రజేద్వైష్ణవం ధామ దే వైస్సమ్యక్సభాజితః 24
తతః కనఖలే తీర్థే దిక్షిణీం దిశమాశ్రితే | త్రిరాత్రోపోషిత స్స్నాత్వా ముచ్యతే సర్వకిల్బిషైః 25
అధ యస్తత్ర గాం దద్యా ద్ర్భాహ్మణ వేదపారగే | సకదాచిన్న పశ్యేత్తు దేవి వైతరణీం యమమ్‌ 26
అత్ర జప్తం హుతం తప్తం దత్తమానన్త్యముశ్నుతే | అత్రైవ జహ్నుతీర్థం చ యత్ర వైజహ్నునా పురా 27
రాజర్షిణా నిపీతాభూ ద్గండూషీ కృత్య సా నదీ | ప్రసాదితేన సా తేన ముక్తా కర్ణాద్వినిర్గతా 28
తత్ర స్నాత్వా మహాభాగే యోనరశ్శ్రద్ధయాన్వితః | సోపవాసస్సమ భ్యర్చే ద్బ్రాహ్మణం వేదపారగమ్‌ 29
భోజయే త్పరమాన్నేన స్వర్గే వసేత్సతు | అధ పశ్చాద్దిశి గతం కోటితీర్థం సుమధ్యమే 30
యత్ర కోటిగుణం పుణ్యం భ##వేత్కోటీశదర్శనాత్‌ | ఉషై#్యకాం రజనీం తత్ర పుండరీకమవాప్నుయాత్‌ 31
తదైవోత్తర దిగ్భాగే సప్తగంగేతి విశ్రుతమ్‌ | తీర్థం పరమకం దేవి సర్వపాతక నాశనమ్‌ 32
యత్రాశ్రమాశ్చ పుణ్యావై సప్తర్షీణాం మహామతే | తేషు సర్వేషు తు పృధక్‌ స్నాత్వా సంతర్ప్యదేవతాః 33
పితౄంశ్చ లభ##తే మర్త్యా ఋషిలోకం సనాతనమ్‌ | భగీరధేన వైరాజ్ఞా యదానీతా సురాపగా 34
తదా సా ప్రీతయే తేషాం సప్తధారాగతా భవత్‌ | సప్తగంగం తతస్తీర్ధం భువి విఖ్యాతి మాగతమ్‌ 35
స ఆవర్తం తతః ప్రాప్య సంతర్ప్యా మరపూర్వకాన్‌ | స్నాత్వా దేవేన్ద్ర భవనే మోదతే యుగమేవ చ 36
తతో భ##ద్రే సమాసాద్య కపిలాహ్రదముత్తమమ్‌ | ధేనుం దత్త్వా ద్విజాగ్ర్యాయ గోసహస్ర ఫలం లభేత్‌ 37
అత్రైవ నాగరాజస్య తీర్థం పరమ పావనమ్‌ | అత్రాభిషేకం యః కుర్వా త్సో
% భయం సర్వతో లభేత్‌ 38
వసువు పలికెను : వినువారికి చదువు వారికి పాపనాశమగు పుణ్యప్రదమగు గంగాద్వారా మాహాత్మ్యమును చెప్పెదను. వినుము. భగీరధుని రథముననుసరించిన గంగ వేలకొలది పర్వతములను భేదించుకొని భూమికి చేరిన ప్రదేశము అలకనందయనబడు చున్నది. పూర్వము ఇచటనే దక్షప్రజాపతి యజ్ఞేశుని పూజించెను. ఈ యజ్ఞమునకు ఆహ్వానించబడిన ఇంద్రాది దేవతలు యజ్ఞభాగమును గ్రహించగోరి తమ తమ పరివారములతో వచ్చిరి. అట్లే బ్రహ్మర్షులు శిష్యప్ర శిష్యులతో, రాజర్షులు అందరూ వచ్చిరి. గంధర్వులు, అప్సరసలు, యక్షులు, సిద్ధ విద్యాధరోరగులు అందరూ యజ్ఞభూమికి వచ్చిరి. ఒక శంకరుడు మాత్రము రాలేదు. అంతట దక్షయజ్ఞోత్సవమునకు ప్రియులతో కలసి విమానములలో వెళ్ళువారిని చూచిన సతీదేవి ఉత్కరంఠతో మహాదేవుని తాను వెళ్ళుటకు ప్రార్థించెను. మహాదేవుడు సతీదేవి ప్రార్థనను విని వెళ్ళుట మంచిది కాదని పలికెను. జరుగవలసిన దానిని గౌరవించిన సతీదేవి మహాదేవుని మాటను ఆదరించక ఒంటరిగా తండ్రి యజ్ఞమును చూచుటకు వెళ్ళెను. కాని సతీదేవితో అచట ఎవరూ మాటాడలేదు. ఆ అవమానమును భరించలేని సతీదేవి అచటనే ప్రాణములను విడిచెను. ఆ ప్రదేశము పవిత్ర క్షేత్రమాయెను. ఈ తీర్థమున స్నానము చేసి దేవతలకు పితరులకు తర్పణము చేసినవారు సతీదేవి ప్రీతిపాత్రులై భోగములను మోక్షమును పొందుదురు. ఇచట నిరాహారాదులచే ప్రాణములను విడిచినవారు శివుని చేరి మరల జన్మను పొందరు. అంతట తన ప్రియురాలి దేహత్యాగమును నారదునివలన వినిన శంకరుడు వీరభద్రుని సృజించెను. వీరభద్రుడు ప్రమధ గణములతో వెడలి ఆయజ్ఞమును ధ్వంసము గావించెను. బ్రహ్మ ప్రార్థనచే మృతులను జీవింపచేసి మరల యజ్ఞమును చక్కబరచెను. ఇట్లు చేసిన ఈ ప్రదేశము సాటిలేని ఉత్తమ తీర్థమాయెను. ఇచట స్నానమడిన చంద్రుడు రోగవినిర్ముక్తుడాయెను. ఇచట స్నానమాడి కోరిన ప్రతి కోరిక తీరును. ఇచటనే దక్షప్రజాపతి దేవతలు యజ్ఞేశ్వరుడగు శ్రీహరిని స్తుతించిరి. ఇదియే శ్రీహరి క్షేత్రమాయెను. ఈ హరిక్షేత్రమున స్నానమాడిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై భుక్తిని ముక్తిని పొందెదరు. ఇచట నుండి పూర్వదిగ్భాగమున త్రిగగమను తీర్థము కలదు. ఇచట గంగ ప్రత్యక్షముగా అందరికి త్రిపథగా కనిపించును. ఇచట శ్రద్ధతో స్నానమాడి దేవతలకు పితరులకు ఋషులకు దేవతలకు తర్ఫణము నిచ్చినవారు స్వర్గమున దేవతల వలె ఆనందింతురు. ఇచట ప్రవాహమున పడి మరణించిన వారు దేవతల వలె ఆనందింతురు. ఇచట ప్రవాహమునుండి మరణించినవారు దేవతల పూజనంది విష్ణులోకమును చేరెదరు. ఇచటికి దక్షిణ దిశలో నున్న కనఖల తీర్థమున మూడు రాత్రులుపవసించి స్నానమాడి సర్వపాప వినిర్ముక్తుడగును. ఇచట వేదపారగుడగు బ్రాహ్మణునకు గోదానమును చేసినవారు వైతరణీనదిని యముని చూడజాలరు. ఇచట చేసిన జపము తపము దానము యజ్ఞము అక్షయమగును. ఇచటనే జహ్నుతీర్థము కలదు. ఇచటనే పూర్వము జహ్నుమహర్షి గంగానదిని గండూషముగా చేసి పానము చేసెను. తరువాత దేవతలు ప్రార్థించగా చెవి నుండి విడిచెను. ఇచట శ్రద్ధగా స్నానము చేసినవాడు ఉపవాసముతో దేవపారగుడగు బ్రహ్మణుని పూజించి పరమాన్నముతో భుజింపచేసిన కల్పకాలము స్వర్గమున నివసించును. ఇచటికి పశ్చిమమున ఉన్న కోటీ తీర్థమునకు వెళ్ళి కోటీశుని దర్శించుటచే కోటి గుణముగు పుణ్యమును పొందును. ఇచట ఒక రాత్రి ఉపవసించి పుండరీకఫలమును పొందును. ఇచట ఉత్తర దిగ్భాగమున సర్వపాతక నాశనమగు సప్తగంగయను ప్రసిద్ధ క్షేత్రము కలదు. ఇచటనే పవిత్రములగు సప్తర్షుల ఆశ్రమములు కలవు. వీటిలో ఒక్కొక్క తీర్థమున వడిగా స్నానమాడి దేవతలకు తర్ఫణముగావించి పితృతర్ఫణము చేసి సనాతనమగు ఋషిలోకమున చేరును. భగీరధుడు గంగను తీసుకొని వచ్చినపుడు ఋషుల ప్రీతి కొరకు ఇచటనే సప్తధారలుగా మారెను. అందువలన సప్త గంగ తీర్థమని ప్రసిద్ధిగాంచినది. ఇచట నుండి ఆవర్తమున చేరి దేవపిత్రాదులను తృప్తిపరచి స్నానమాడి ఇంద్రలోకమున యుగములు నివసించును. తరువాత కపిలాహ్రదమును చేరి బ్రాహ్మణునకు గోదానమును చేసి సహస్ర గోదానఫలమును పొందును. ఇచటనే పరమపావనమగు నాగరాజ తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు సర్పములనుండి అభయము పొందును.
తతో లలితకం ప్రాప్య శంతనో స్తీర్థముత్తమమ్‌ | స్నాత్వా సంతర్ప్య విధివత్‌ సురాదీంల్ల భ##తే గతిమ్‌ 39
యత్ర శంతనునా లభ్దా గంగా మానుష్య మాగతా | తత్రైవ తత్యజే దేహం వసూన్సూత్వాను వత్సరమ్‌ 40
తద్దేహాన్యపత్తత్ర తత్రాభూదృక్షజన్మచ | తత్ర యస్స్నాతి మనుజో భక్షయే దోషధీం చ తామ్‌ 41
సన దుర్గతి మాప్నోతి గంగాదేవి ప్రసాదతః | భీమ స్థలం తతః ప్రాప్య యస్స్నాయాత్సుకృతీ నరః 42
భోగాన్భుక్త్యేహ దేహాంతే స్వర్గతిం సమవాప్నుయాత్‌ | ఏతాన్యుద్దేశతో దేవి తీర్ధాని గదితాని తే 43

అన్యాని వై మహాభాగే సన్తి తత్ర సహప్ర శః | యో
%స్మిన్‌ క్షేత్రే నర స్స్నాయా త్కుంభ##గేజ్యే% జగే రవౌ 44
సతు స్యాద్వాక్పతి స్యాక్షా త్ర్పభాకర ఇవాపరః | అధ యాతే ప్రయాగాది పుణ్యతీర్థే పృధూదకే 45
అధ యో వారుణ యోగే మహావారుణ కే తధా | మహామహావారుణ చ స్నాయాత్తత్ర విధానతః 46
సంపూజ్య బ్రాహ్మణాన్భక్త్యా స లభేద్ర్బహ్మణః పదమ్‌ | సంక్రాన్తౌ వాప్యమాయాం వా వ్యతీపాతే యుగాదికే 47

పుణ్య
%హని తధాన్యద్వై యత్కించిద్దానమాచరేత్‌ | తత్తు కోటి గుణం భూయా త్సత్యమేతన్మయోదితమ్‌ 48
గంగాద్వారం స్మరేద్యోవై దూరసంస్థో
%పి మానవః | సద్గతిం స సమాప్నోతి స్మరన్నంతే యధా హరిమ్‌ 49
యం యం దేవం హరిద్వారే పూజయేత్ర్పయతో నరః | స స దేవస్సు ప్రసన్నః పూరయేత్తన్మనోరధాన్‌ 50
ఏతదేవ తపస్థ్సాన మేతదేవ జపస్థలమ్‌ | ఏతదేవ హుతస్థానం యత్ర గంగా భువం గతా 51

యస్తత్ర నియతో మర్త్యో గంగానామసహస్రకమ్‌ | త్రికాలం పఠతి స్నాత్వా సో
%క్షయాం సంతతిం లభేత్‌ 52
గంగా ద్వారే పురాణం తు శృణుయాద్యశ్చభక్తితః | నియమేన మహాభాగే స యాతి పదమవ్యయమ్‌ 53

హరిద్వారస్య మాహాత్మ్యం యశ్శృణోతి నరోత్తమః | పఠేద్వా భక్తిసంయుక్త స్సో
%పి స్నానఫలం లభేత్‌ 54
దేవి తిష్ఠతి యద్గేహే మాహాత్మ్యం లిఖితం త్విదమ్‌ | తద్గృహేసర్పచోరాగ్ని గ్రహరాజభయం న హి 55
వర్ధతే సంపదస్సర్వా విష్ణుదేవప్రసాదతః 56
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే
బృహదుపాఖ్యానే వసుమోహినీసంవాదే
హరిద్వారమాహాత్య్మం నామ

షట్షష్టి త్తమో8
s ధ్యాయః
తరువాత లలితకమను శంతను తీర్థమును చేరి స్నానమాడి దేవాదులను యధావిధిగా తృప్తిపరిచి ఉత్తమ గతిని పొందును. ఇచటనే శంతనుడు మనుష్యభావమును పొందిన గంగను పత్నిగా పొందెను. ఇచటనే అష్ట వసువులను సంవత్సర క్రమముతో ప్రసవించి దేహమును విడిచెను. ఆ దేహము ఇచటనే పడెను. ఇచటనే ఋక్షజన్మ కలిగెను. ఇచట స్నానమాడి ఈ ఔషధిని భక్షించినచో గంగాదేవి ప్రసాదమువలన దుర్గతిని పొందజాలరు. తరువాత భీమస్థలమున చేరి స్నానమాడినవాడు ఇహమున సకల భోగములను పొంది అంతమున స్వర్గమున చేరును. ఇవి ఇచట ముఖ్యమగు తీర్థములు. ఇచట ఇంక నూర్ణకొలది తీర్థములు కలవు. బృహస్పతి కుంభరాశిగతుడైనపుడు, సూర్యుడు మేషరాశిగతుడైనపుడు ఈ క్షేత్రమున స్నానమాడినవాడు సాక్షాత్తుగా వాక్పతి అపరసూర్యుడుగా విరాజిల్లును. ప్రయాగాది పుణ్య తీర్థములకు పృధూదకములకు వెళ్ళినపుడు వారుణయోగమున మహావారుణయోగమున ఇచట యధావిధిగా స్నానము చేయవలయును. బ్రాహ్మణులను భక్తిచే పూజించి బ్రహ్మలోకమునుపొందున. సంక్రాన్తియందు అమావాస్యయందు, వ్యతీపాతమునందు, యుగాదియందు, ఇతర పవిత్ర దినములందు ఏ కొంచెము దానము నాచరించిననూ అది కోటి గుణమగును. దూరముననున్నవాడు కూడా గంగాద్వారమును స్మరించినచో అంతకాలమున హరిని స్మరించినవాని వలె సద్గతినిపొందును. హరిద్వారమున పూజించిన ప్రతిదేవుడు పూజించినవారి మనోరథములను తీర్చును. ఇదియే తపస్థ్సానము. జపస్థ్సలము. హోమస్థానము. ఇచట నియమబద్ధుడై గంగా సహస్రనామమును త్రికాలమునందు పఠించువారు అక్షయసంతానమును పొందును. గంగాద్వారమున భక్తితో పురాణమును వినువారు అవ్యయపదమును పొందును. హరిద్వారమాహాత్మ్యమును వినువారు. పఠించువారు కూడా స్నానఫలమును పొందుదురు. గంగా మాహాత్మ్యమును వ్రాసి ఇంటిలో ఉంచుకొనిన సర్పచోరాగ్నిగ్రహ రాజభయములు కలుగవు. శ్రీహరి అనుగ్రహము వలన ఆతని ఇంటిలో సంపదలు పెరుగుచుండును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యానమున వసుమోహినీ

సంవాదమున హరిద్వారమాహాత్మ్యమను
= అరువదియారవ అధ్యాయము బదరికాశ్రమ మాహాత్మ్యమ్‌

Sri Naradapuranam-3    Chapters    Last Page